సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 27: మహాత్మాజ్యోతిబాఫూలే వర్థంతిని బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని 30వ వార్డులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరయ్యారు. మహాత్మాజ్యోతిబాఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిబాఫూలే బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవమన్నారు. వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు.
30వ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని, గతంలో వార్డు అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేయించానని గుర్తుచేశారు. ప్రభుత్వం మారడంతో మంజూరైన నిధులు రైద్దెనట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వార్డు అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందని వెల్లడించారు. అనంతరం కాలనీ వాసులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను శాలువాతో సన్మానించారు. మాజీ సీడీసీ చైర్మన్లు విజయేందర్‌రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జైపాల్‌రెడ్డి, అనంతయ్య, బీరయ్య యాదవ్, ఆంజనేయులు, అన్వర్ పాల్గొన్నారు.