పెద్దశంకరంపేట, ఫిబ్రవరి21 : మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధిలోని గొట్టిముక్కుల గ్రామంలో రాజుల గుట్టపై నూతనంగా నిర్మించిన ఆత్మలింగ శివాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి హజరై ప్రత్యేక పూజలు చేశారు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో.. భక్తిభావంతో మెలగాలని భక్తులకు ఈ సందర్భంగా తొగుట పీఠాధిపతి సూచించారు. ఉదయం నుంచి వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛరణలతో గణపతి హోమం పూజ, యాగ ప్రవేశం, రుత్విక్ వరణం, రక్షబంధనం, ద్వారాక పూజ, నవగ్రహ పూజ తదితర హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాన్ని రకరకాల పూలతో అందంగా అలంకరించారు.