పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజ లు తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని, ఇండ్లను పదిలంగా చూసుకునే వారికి చెప్పి వెళ్లాలని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పండుగలకు ఊరికి వెళ్లే వారు పోలీసులకు సమాచారం అందిస్తే నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. పండుగను పురస్కరించుకుని కొత్త బట్టలు, బంగారు ఆభరణాలు ధరించి వేడుకల్లో పాల్గొంటారని, ఆ సమయం లో పిల్లలకు బంగారు నగలు వేస్తే దొంగతనం జరిగే ప్రమా దం ఉందన్నారు. కొంతమంది తమ బ్యాగుల్లో విలువైన వస్తువులు ఉంచి, బస్సు ఆగిన చోట సీట్లో ఆ బ్యాగును పెట్టి తినుబండారాలు తీసుకోవడం, తాగునీళ్లు, టీ తాగడానికి వెళ్తుంటారని, ఆ సమయంలో దొంగతనం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు.
సంగారెడ్డి/సిద్దిపేట, జనవరి 13 : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇండ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లేవారితో పాటు స్థానిక ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత శుక్రవారం ఒక ప్రకటనలో సూ చించారు. పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని ప్రజలను అప్రమత్తం చేస్తూనే.. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పోలీసుల సలహా లు, సూచనలు పాటించి దొంగతనల నివారణకు ప్రజలు సహకరించాలని సీపీ తెలిపారు. అత్యవసరమైనప్పు డు సిద్దిపేట ఏసీపీ-9490617009, గజ్వేల్ ఏసీపీ-83339986 84, హుస్నాబాద్ ఏసీపీ- 7901640468, కంట్రోల్ రూం -8333998699, డయల్ 100కు సమాచారం అందించాలని సీపీ సూచించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు కింది జాగ్రత్తలు పాటించాలన్నారు.
సిద్దిపేట పోలీస్ శాఖ.. ప్రజలకు చేస్తున్న సూచనలు