MLA Sunitha lakshma reddy | నర్సాపూర్, ఆగస్ట్ 14 : స్వర్గీయ వాకిటి లక్ష్మారెడ్డి 26వ వర్ధంతి వేడుకలు రేపు నర్సాపూర్ మున్సిపాలిటీలోని కంజర్ల ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ప్రతి ఏటా లక్ష్మారెడ్డి స్మారకార్థం నిర్వహించే రక్త దాన శిబిరాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు.
తన భర్త లక్మారెడ్డి వర్ధంతి వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు నివాళులర్పించి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కోరారు.