Leopard | రామాయంపేట రూరల్, మే 3 : రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన వాటర్మెన్ శనివారం తెల్లవారుజామున నల్లా నీళ్లు వదలడానికి వెళ్తుండగా చిరుత కనిపించిందని గ్రామంలో తెలుపగా అప్రమత్తమైన గ్రామస్థులు విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. వెంటనే రేంజ్ అధికారి మురళీధర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి ఆనవాళ్లు సేకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కోనాపూర్ శివారులో చిరుత సంచరించినట్లు ఆనవాళ్లు లభించలేదన్నారు. అయినప్పటికి రైతులు రాత్రి వేళ్లల్లో ఒంటరిగా వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లవద్దని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, గ్రామస్థులకు చిరుత కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.