చేగుంట, సెప్టెంబర్2: తెలంగాణలో జరిగిన అభివృద్ధిని దేశం మొత్తం గర్విస్తున్నదని, పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండి భారీ మోజార్టీతో గెలిపించుకోవాలని మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నార్సింగి మండల కేంద్రంలోని జీఏవీఆర్ ఫంక్షన్ హాల్లో శనివారం ఎంపీ సమక్షంలో నర్సంపల్లి పెద్దతండా గ్రామం నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లా డుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు.
తెలంగాణలో రైతులు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, 24 గంటల ఉచిత విద్యుత్, ప్రాజెక్టులు నిర్మిం చి కాల్వల ద్వారా సాగు నీరు అందిస్తున్నారన్నారు. చేనేత, గీత, బీడీ కార్మికులు, కొత్తగా బీడీ టేకేదారులకు కూడా పింఛన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. పేద ఆడబిడ్డల పెండ్లీలు చేస్తే కల్యాణలక్ష్మి ద్వారా రూ. లక్షా116ను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తున్నట్లు తెలిపారు. గృహలక్ష్మితో రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నదన్నా రు. దుబ్బాక నుంచి భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు బక్కి వెంకటయ్య, ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మైల రాం బాబు, వైస్ ఎంపీపీ దొబ్బల సుజాత, ఎంపీటీసీ సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ శంకర్‌గౌడ్, అంచనూరి రాజేశ్, పెద్ద తండా సర్పంచ్ ఛత్రీయనాయక్, ఎన్నం లింగారెడ్డి, రాజేందర్, కుమ్మరి నర్సింహులు, బిక్యానాయక్, భూపతి, యాదగిరి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్ని ఎంపీ పరామర్శ
మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేశం తండ్రి రెండు రోజుల క్రితం మృతి చెందాడు. నార్సింగి ఎంపీటీసీ ఆకుల సుజాత, బాధిత కుటుంబాన్ని మెదక్ ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు.