మద్దూరు(ధూళిమిట్ట), మే07: ధూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లిలో బుధవారం జరిగిన మాజీ సర్పంచ్ బర్మ రాజమల్లయ్య తల్లి కొమురమ్మ దశదినకర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశ్ పాల్గొని కొమురమ్మ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. రాజమల్లయ్యతో పాటు కుటుంసభ్యులను పరామర్శించి, ఓదార్చారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మద్దూరు మండల అధ్యక్షుడు మేక సంతోశ్‌కుమార్, కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్ సెవెల్లి సంపత్, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు మలిపెద్ది మల్లేశం, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కోరె ఎల్లయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ దేవునూరి దేవదాసు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దాసరి పురుషోత్తం, బీఆర్ఎస్ నాయకులు మేక ఉమామహేశ్వర్, బియ్య రమేశ్, తదితరులు ఉన్నారు.