కంది, నవంబర్ 8: ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో బుధవారం జరిగిన బహిరంగసభకు హాజరవుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు కంది శివారులో ఘన స్వాగతం పలికారు. సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలికారు. కంది నుంచి రోడ్ షోగా భారీ ర్యాలీగా సంగారెడ్డి బయలుదేరి వెళ్లారు. ప్రచార రథంపైకి ఎక్కిన మంత్రి కేటీఆర్ ప్రజలు, పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ఉత్సాహాన్ని నింపారు.
కేటీఆర్‌కు అడుగడుగునా నీరాజనాలు పలికారు. కేటీఆర్ రాక సందర్భంగా పార్టీ నాయకులు డ్యాన్స్‌లు చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు. వేలాదిగా చేరుకున్న యువకులు, పార్టీ నాయకులతో కంది జాతీయ రహదారంతా గులాబీమయమైంది. మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలికిన వారిలో టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ కృష్ణగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఖాజాఖాన్, బీఆర్ఎస్ కంది మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నాయకులు రాంరెడ్డి, మనోహర్ గౌడ్ భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
కొండాపూర్, నవంబర్ 8: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పుపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన రోడ్‌షోకు కొండాపూర్ మండలం నుంచి యువత భారీ బైక్ ర్యాలీగా పాల్గొన్నారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి 100కుపైగా బైక్‌లతో యువత మల్కాపూర్ శివారు నంచి సంగారెడ్డి గంజీ మైదాన్ వరకు మంత్రి కేటీఆర్‌కు బైక్ ర్యాలీలతో ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ జిందాబాద్, కారు గుర్తుకే మనఓటు అనే నినాదాలతో నేషనల్ హైవే 65 దద్దరిల్లింది.
కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మావతీ పాండురంగం, వైస్‌ఎంపీపీ లక్ష్మీరాంచందర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రుక్ముద్దీన్, మండల ఎన్నికల పరిశీలకులు తిరుపతిరెడ్డి, చింతా సాయినాథ్, ఎంపీటీసీలు రాందాస్, శ్రీనివాస్‌గౌడ్, సొసైటీ చైర్మన్లు పవన్‌కుమార్, రాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకం విఠల్, బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, సర్పంచ్‌లు, బీఆర్ఎస్ నాయకులు జగదీశ్వర్, ఇంద్రారెడ్డి, నాగేశ్, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, యువత నాయకులు కృష్ణమూర్తి, రఘునాథ్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, సత్యానందం, గురుకిరణ్, జలీల్, అజీం, రవి తదితరులు పాల్గొన్నారు.