మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 29: వినియోగదారులపై చార్జీల భారం మోపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విద్యుత్ నియంత్రణ మం డలి దృష్టికి తీసుకెళ్లి పెంచకుండా కృషి చేసినందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం మెదక్ బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించుకున్నారు. అనంతరం కేసీఆర్, పద్మాదేవేందర్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశా రు.
ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ..రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేవ లం 10 నెలల కాలంలోనే 18,500 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు ప్రతిపాదనలు చేసిందన్నారు. ప్రజలపై విద్యుత్ భారం మోపడాన్ని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించిందన్నా రు. తమ వాదనలను విద్యుత్ నియంత్రణ మం డలి గుర్తించి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించిందన్నారు.
పెంపు ప్రతిపాదనలను తిరస్కరించిన విద్యుత్ నియంత్రణ మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు సుంకయ్య, కిశోర్, మాజీ కౌన్సిలర్లు మాయ మల్లేశం, సోహైల్, సాధిక్, బీఆర్ఎస్ నాయకులు గడ్డమీది కృష్ణాగౌడ్, సంగ శ్రీకాంత్, కిరణ్, చాంద్‌పాషా, జయరాంరెడ్డి, కండెల సాయిలు తదితర నాయకులు పాల్గొన్నారు.