దుబ్బాక, జూలై 28: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన తన కార్యాలయంలో ఆర్అండ్బీ, పీఆర్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గంలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్‌కు సంబంధించిన రోడ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నూతన రోడ్లకు సంబంధించిన వాటిపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మా ట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలంలో రోడ్లు గుంతలమయంగా మారాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
దుబ్బాక నియోజకవర్గంలో 100 కిలోమీటర్ల రోడ్లకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన 81 కిలోమీటర్లు, ఆర్అండ్బీ శాఖకు సంబంధించిన 22 కిలోమీటర్ల రోడ్లకు నిధులు మంజూరైనట్లు వివరించారు. దుబ్బాక నియోజకవర్గంలో పోతారెడ్డిపేట-కల్వకుంట్ల, తాళ్లపల్లి రోడ్డుకు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి మారేమ్మ దేవాలయం వరకు, బల్వంతాపూర్, నర్లేన్గడ్డ, పద్మశాలీవాడ రోడ్డు, రామక్కపేట-చీకోడు రోడ్డు, లచ్చపేట, చీకోడు రోడ్డు, తొగుట,
తుక్కాపూర్ బైపాస్ రోడ్లు, గోవర్ధన్‌గిరి- కొండాపూర్, కొండాపూర్, బుస్తాపూర్, వరదరాజ్‌పల్లి రోడ్డు, చెప్యాల-మాదన్నపేట , జప్తిలింగారెడ్డిపల్లి చౌరస్తా – చెప్యాల వరకు, దౌల్తాబాద్-గొడుగుపపల్లి, మక్కరాజ్‌పేట, తిరుమలపూర్, గొడుగుపల్లి, షాపూర్ రోడ్డు, ఇందూప్రియాల్-చందాయిపేట, ముబారస్పూర్, శూరీపూర్, మల్లేశంపల్లి రోడ్డు, చౌదరిపాలెం-చిన్నమాసాన్‌పల్లి, గొల్లపల్లి-ఇందుప్రియాల్ రోడ్డు, పులిమామిడి, బీకొండాపూర్ రోడ్డు, చందాయిపేట-మసాయిపేట రోడ్డు, పెద్దశివనూర్-చిన్నశివనూర్, చెట్లతిమ్మాయిపల్లి-నడిమితండా, ఎన్‌హెచ్7 -చిట్టోజుపల్లి రోడ్డు, సూరంపల్లి-నాచారం రోడ్డుకు నిధులు మంజూరయ్యాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.