అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి
అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్‌లోని రైతు వేదికలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, మండల, జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
- పార్టీలకతీతంగా అభివృద్ధిపై దృష్టి సారించాలి
- యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి
- దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆదేశం
- సిద్దిపేట జిల్లా రాయపోల్‌లోని రైతు వేదికలో సమీక్షా సమావేశం
రాయపోల్, జూలై 21: అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్‌లోని రైతు వేదికలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, మండల, జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేనివిధంగా రాయపోల్ మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు గ్రామాల సర్పంచ్‌లు విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో విద్యుత్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ ఎస్ఈతో ఫోన్లో మాట్లాడారు.
రాయపోల్ మండలంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. రైతులకు అందుబాటులో ఉండి యూరియా కొరత లేకుండా చూడాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు వచ్చే విధంగా చూడాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. వివిధ కాల్వల నిర్మాణానికి అవసరమైన భూములు సేకరించి రైతులకు పరిహారం చెక్కులు అందజేయాలన్నారు. పనులు తొందరగా ప్రారంభించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య, మండల ప్రత్యేకాధికారి బాబూనాయక్, తహసీల్దార్ కృష్ణమోహన్, డీఎల్పీవో లత, డీఏవో సురేశ్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీఎం యాదగిరి, పీఆర్ ఏఈ రామ్‌కుమార్, ఐసీడీఎస్ షభానా, మిషన్ భగీరథ ఏఈ అభినయ్, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

