చేగుంట, సెప్టెంబర్ 25: కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైదని, రేవంత్‌కు పాలన చేతకావడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల్లో డీలర్ భిక్షపతి ఏర్పాటు చేసిన మల్లికార్జున ఫంక్షన్ హాల్‌ను గురువారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో గొప్పగా జరుపుకొనే బతుకమ్మ, దసరా పండుగలకు ఏర్పాట్లు చేయడంలో విఫలమైందన్నారు.
కేసీఆర్ పాలనలో అధికారులతో ముందే సమీక్షలు నిర్వహించి, అన్ని ఏర్పాట్లు చేసేవారన్నారు. పంచాయతీలకు నిధులు రాక పల్లెల్లో సమస్యలు తాండవిస్తున్నాయని, పారిశుధ్యం పడకేసి ప్రజలు జబ్బుల బారిన పడుతున్నట్లు తెలిపారు. ఆరుగ్యారెంటీలు, హామీలు అటకెక్కాయని, అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు సోలిపేట సతీష్‌రెడ్డి, జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి,రణం శ్రీనివాస్‌గౌడ్, చేగుంట, బీఆర్ఎస్ నార్సింగి మండల అధ్యక్షుడు కోమండ్ల నారాయణరెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ అయిత రఘురాములు, నాయకులు మహ్మద్ అలీ, డిష్‌రాజు,మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు గణేశ్, అశోక్, బాల్నర్సు, రాములు పాల్గొన్నారు.