మర్కూక్, మార్చి 22: అన్నివిధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కన్నీటి గోస పేరుతో ఆయన చేపట్టిన మహా పాదయాత్ర శనివారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంది.
ఆయనకు గణేశ్‌పల్లి వద్ద ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ రామచంద్ర, మాజీ ఎంపీపీ పాండుగౌడ్, వైస్ ఎంపీపీ బాల్‌రెడ్డి, కృష్ణయాదవ్, మ్యాకల కనకయ్య ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కవర్గం సంతోషంగా లేదన్నారు. ఒక్క హామీని ప్రభు త్వం నిలబెట్టుకోలేదన్నారు. కేసీఆర్ పాలనలో గోదావరి జీవనదిని తలపించగా, కాంగ్రెస్ వచ్చాక ఎడారిగా మారిందని కోరుకంటి చందర్ తెలిపారు.