జహీరాబాద్, ఏప్రిల్ 23: ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం న్యాల్కల్ మండలంలోని మామిడ్గి గ్రామ శివారులోని ఎస్ఎస్వీ కన్వెషన్ హాల్లో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించి చైతన్యపర్చాలన్నారు.
ఈనెల 27న మండలంలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో ఉదయం పార్టీ జెండాలను అవిష్కరించిన తర్వాత ప్రత్యేక వాహనాల్లో వరంగల్ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలను భారీగా తరలిరావాలన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, న్యాల్కల్, జహీరాబాద్, ఝరాసంగం మండలాల పార్టీ అధ్యక్షులు రవీందర్, తట్టు నారాయణ, వెంకటేశం, మండల పార్టీ నాయకులు నర్సింహారెడ్డి, సంగ్రాంపాటిల్, భూమరెడ్డి, ప్రవీణ్‌కుమార్, రాజ్‌కుమార్, రాజేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, హనీఫ్, వెంకట్, దేవదాస్, మహేశ్, వెంకట్‌రెడ్డి, ఉమేశ్, మండల మాజీ సర్పంచ్, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు రవీకుమార్, షబ్బీర్‌ఖాన్, మాజీ సర్పంచులు మారుతీ యాదవ్, శ్రీనివాస్, మహిపాల్, గుండప్ప తదితరులు పాల్గొన్నారు.
దుబ్బాక, ఏప్రిల్ 23: కేసీఆర్ కారణ జన్ముడని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కేసీఆర్ వివాహా వార్షికోత్సవం సందర్భంగా దుబ్బాక బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన సంబురాలు జరుపుకొన్నారు. కేక్ కట్ చేసి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కేసీఆర్ అలుపెరుగని పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు.
ఈనెల 27న జరగనున్న రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఛలో వరంగల్ సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజమౌళి, ఎల్లారెడ్డి, రవీందర్‌రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.