చేర్యాల, ఆగస్టు 6 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఉద్యోగులను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ బదిలీ చేశారు.అర్ధరాత్రి దాటిన అనంతరం బదిలీకు సంబంధించిన ఉత్తర్వులు రావడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యరు. లక్ష్మీనరసింహ ఆలయానికి కొమురవెల్లి మల్లన్న ఆలయ ఉద్యోగులు ఎక్కువ సంఖ్య లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ దేవాలయానికి బదిలీ అయ్యారు.
కొమురవెల్లి మల్ల న్న ఆలయానికి కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి, యాదగిరిగుట్ట శ్రీ ల క్ష్మీనరసింహస్వా మి దేవాలయ ఉద్యోగులు బదిలీపై వచ్చారు. కొమురవెల్లి మల్లన్న ఆలయ విద్యుత్ ఏఈ బి.అంజయ్య యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి బదిలీ కాగా ఆయన స్థానంలో యాదగిరిగుట్ట దేవాలయంలో విద్యుత్ విభాగంలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పని చేస్తున్న ప్రభాకర్‌రావు కొమురవెల్లికి వచ్చారు.
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న పి.మాధవి, ఈ.సందీప్ యాదగిరిగుట్ట దేవాలయానికి బదిలీ అయ్యా రు. ఇరువురి స్థానాల్లో యాదగిరిగుట్టలో పని చేస్తున్న నరసింహులు, కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీరాజ్యం కొమురవెల్లికి బ దిలీపై వచ్చారు.కొమురవెల్లిలో ఖాళీగా ఉన్న రెండు సూపరింటెండెంట్ పోస్టులను దేవాదాయశాఖ ఉన్నతాధికారులు భర్తీ చేశారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం నుంచి శ్రీరాములు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుంచి సురేందర్‌ను కొమురవెల్లి సూపరింటెండెంట్లుగా బదిలీ పై వచ్చారు.20 ఏండ్ల అనంతరం కొమురవెల్లి మల్లన్న ఆలయంలో బదిలీలు జరిగాయి. గతంలో జరిగిన బదిలీల్లో భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆల యం, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వా మి, వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాలకు బదిలీ పై వెళ్లారు.
తాజాగా నలుగురు ఉద్యోగులు బదిలీ కాగా వారి స్థానాల్లో ముగ్గురు యాదగిరిగుట్ట నుంచి రాగా ఖాళీగా ఉన్న సూపరింటెండెంట్ పోస్టులను కొండగట్టు,యాదగిరిగుట్ట దేవాలయాలకు చెందిన ఉద్యోగులతో భర్తీ చేశారు. కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఏఈవోలుగా పని చేస్తున్న గంగా శ్రీనివాస్ ఇటీవల సస్పెన్షన్‌కు గురికాగా, మరో ఏఈవో బుద్ధి శ్రీనివాస్ సైతం బదిలీ అవుతారని ప్రచారం జరిగినప్పటికీ ఎలాంటి మార్పు జరగలేదు.