కొమురవెల్లి, జూలై 12 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న భక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమయం ఎట్టకేలకు వ చ్చింది. ఈనెల 26న కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ను కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్‌యాదవ్, జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వేస్టేషన్‌ను ఈనెల 26న సాయంత్రం 3గంటలకు ప్రారంభించనున్నారు.
అదే రోజు నుంచి రై ళ్లు స్టేషన్లో ఆగనున్నాయి. సికింద్రాబాద్- సిద్దిపేట మా ర్గంలో ప్రస్తుతం రానుపోను రెండు రైళ్లు నడుస్తుండగా, భవిష్యత్తులో రైళ్ల సం ఖ్యను పెంచడంతో పాటు రైల్వేస్టేషన్లో ప్రయాణికుల సదుపాయాలను మెరుగురుచడంపై రైల్వే శాఖలోని మూడు విభాగాల అధికారులతో కమిటీ వేశారు. ఈ మేరకు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి పలు అంశాలపై దృష్టి సారించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికంగా, పర్యాటకానికి ఊతమివ్వాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లైన్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. కేసీఆర్ ప్రభు త్వం అవసరమైన సహకారం అందించడం, భూసేకరణ తదితర అంశాలను వేగవంతం చేయడంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగిందని కేసీఆర్ దూరదృష్టిని స్థానికులు గుర్తుచేస్తున్నారు.