హుస్నాబాద్ టౌన్, జూన్ 4: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు కిసాన్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి రాధిక తెలిపారు. వ్యవసాయమార్కెట్ యార్డులో కిసాన్ మేళా ఏర్పాట్లను ఆమె బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలోని ఐదు డివిజన్ల నుంచి నుంచి దాదాపు పదివేల మంది రైతులు ఈ మేళాకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ మేళాలో విత్తనాలు, నానో యూరి యా, వివిధ శాఖల్లో జరుగుతున్న పనితీరుతో పాటు పలు అంశాలను వివరించే స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
వెయ్యిమంది రైతులకు ఒక వర్క్‌షాపు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని, ఇందులో సెరికల్చర్, హార్టికల్చ ర్, వ్యవసాయం, ఫిషరీస్, పశువైద్యం, అభ్యుదయ రైతుల సక్సెస్స్టోరీలతో పాటు పలు కార్యక్రమాలు ఇందులో ఉంటాయని తెలిపారు. స్టాల్స్‌లో డ్రోన్లు, పనిముట్లు, రోబోటిక్ వీడర్స్, ఆయిల్‌పామ్‌కు కొత్తగా వచ్చిన అంశాలను ఇక్కడ రైతులు నేరుగా చూసి తెలుసుకునే వీలును కల్పిస్తున్నట్లు ఆమె చెప్పారు. రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
మంత్రులు నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్‌గౌడ్ కిసాన్‌మేళాకు హాజరు కానున్నట్లు ల్లా వ్యవసాయాధికారి రాధిక చెప్పారు. ప్రత్యేకంగా జర్మనీ షెడ్లను ఏర్పాటు చేశామని, 15 మంది శాస్త్రవేత్తలు హాజరవుతారని, వీరితో రైతులకు ముఖాముఖి కార్యక్రమాన్ని సైతం నిర్వహించనున్నట్లు చెప్పారు. విత్తనాలు, పనిముట్లు ఇక్కడ ప్రదర్శిస్తారని తెలిపారు. ఏర్పాట్లను జిల్లావ్యవసాయాధికారి రాధిక, హార్టికల్చర్ జేడీ సువర్ణ, వెటర్నరీ జేడీ కొండల్‌రెడ్డి, హుస్నాబాద్ వ్యవసాయశాఖ ఏడీ శ్రీనివాస్, స్టాల్స్ ఇన్చార్జి హుస్సేన్‌బాబు, ఏడీఏ వినోద్‌కుమార్ పరిశీలించారు.