సిద్దిపేట, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమైక్యరాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి తట్టెడు మట్టికూడా నాటి ప్రభుత్వాలు ఎత్తలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత రైతుల ఆత్మహత్యల నివారణకు సాగునీటి అవసరాలు తీర్చడం ఒక్కటే మార్గమ ని కేసీఆర్ భావించారు. తానే స్వయంగా డిజైన్ చేసి ప్రాజెక్టుల రూపకల్పన చేసి ఇవ్వాళ ఉమ్మడి మెదక్ జిల్లా రైతాంగానికి సాగు నీటిని తీసుకువచ్చి రైతుల కష్టాలు తీర్చిన నేత కేసీఆర్. ఎడారిగా ఉన్న మెతుకు సీమను సస్యశ్యామలం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు ఎలాంటి ప్రాజెక్టులు లేవు. కేసీఆర్ అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల నిర్మాణం చేశాడు.
ఈ రిజర్వాయ ర్లు ఇవ్వాళ గోదావరి జలాలతో జలకళను సంతరించుకున్నాయంటే కేసీఆర్ చేసిన కృషి కండ్లముందు కనిపిస్తుంది. ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రికా ర్డు స్థాయిలో నిర్మాణం చేసి వినియోగంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు ఆ ఫలాలను రైతులు అనుభవిస్తున్నారు. ఇంత మంచి ప్రాజెక్టులను చూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కండ్లుమండినాయి. ప్రాజెక్టును నిర్వీర్యం చేద్దామనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆశలు అడియాశలయ్యాయి. కేసీఆర్ చేసిన మంచి పనులు ఇవ్వాళ సజీవంగా ఉన్నాయి. వీటిని చెరిపితే చెడేవి కావన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని రైతులు సూచిస్తున్నారు.
అన్నపూర్ణ రిజర్వాయర్‌ను 3.5 టీఎంసీల సామర్థ్యం తో రాజన్నసిరిసిల్ల – సిద్దిపేట జిల్లాల సరిహద్దులో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. మిడ్‌మానేరు నుంచి తిప్పారం పంప్‌హౌస్ ద్వారా అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు.ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతున్నది. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోసి సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌ను నింపుతున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చద్లాపూర్ వద్ద పంప్హౌస నిర్మాణం చేశారు. ఇక్కడ 134 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు.
ఐదేండ్ల నుంచి నిరంతరాయంగా నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపుతున్నది. రంగనాయకసాగర్ నుంచి మల్లన్నసాగర్‌కు (తుక్కాపూర్ పంపుహౌస్) ద్వారా నీటిని ఎత్తిపోస్తారు. ఇక్కడ 43 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 8 మోటర్లు ఉన్నాయి. వీటి ద్వారానే మల్లన్నసాగర్‌లోకి నీటిని పంపింగ్ చేస్తారు. మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మసాగర్‌కు మర్కూక్ పంప్‌హౌస్ ద్వారా నిటిని ఎత్తిపోస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లలో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని మల్లన్నసాగర్ రిజర్వాయర్. దీని సామర్థ్యం 50 టీఎంసీలు కాగా ఇప్పటి వరకు మల్లన్నసాగర్లో నింపిన గోదావరి జలాలు అత్యధికం అని చెప్పవచ్చు. ఒక 2024-25 సీజన్లోనే నేటి వరకు 17.20 టీఎంసీల గోదావరి నీటిని మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేశా రు. ఈ నీటిలో 5.80 టీఎంసీలు కొండపోచమ్మసాగర్‌కు తరలించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో ఇం తకుముందే ఉన్న 8.50 టీఎంసీల నీటికి అదనంగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 11.400 టీఎంసీల నీటిని నింపారు.
ప్రస్తుతం మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో 19.90 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇది ఇప్పటివరకు మల్లన్నసాగర్లో నింపిన అత్యధిక నీరు. అంతేకాకుం డా రైతులకు వానకాలం, యాసంగి పంటలకు అవసరమైన సాగునీటిని అవసరాల నిమిత్తం, రైతు ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో 21 టీఎంసీలను నిలువచేసే ఉద్దేశంతో ఈ ఎత్తిపోతల ప్రక్రియను ఈనెల 20వతేదీ వరకు కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నది. ఈ నీరు ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా వస్తున్న వరదను మధ్యమానేరులో వడిసిపట్టి అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ ద్వారా కేవలం మూడం చెల ఎత్తిపోతలతో రైతు ప్రయోజనాల కోసం రిజర్వాయర్లను నింపుతున్నారు.
గులాబీ అధినేత కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేసి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మించారు. ఇవ్వాళ ఆ రిజర్వాయర్లు నిం డుకుండలా జలకళను సంతరించుకున్నాయి. ఐదేండ్లుగా జిల్లా రైతాంగానికి ప్రతి ఏటా సాగునీరు అం దించారు. దీంతో జిల్లాలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ఫలితంగా భూమికి బరువయ్యేలా పంటలు పండిన విషయం తెలిసిందే.
ఎక్కడో ఉన్న గోదావరి జలాలను కొండపోచమ్మ వరకు తీసుకువచ్చి ఉమ్మ డి జిల్లా రైతుల గోస కేసీఆర్ తీర్చిండు. నాడు ప్రాజెక్టుల నిర్మాణం కాకముందు జిల్లాలో సాగునీటి కష్టా లు ఉండే, రైతుల ఆత్మహత్యలు ఉండే…కేసీఆర్ కృషి ఫలితంగా రైతులకు సాగునీటి కష్టాలు తీరాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ మొదలుకొని మం త్రుల వరకు ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇవ్వాళ అదే కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు వరంగా మారిందన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది.
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు జలకళను సంతరించుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నిం డుకుండలా మారింది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం 29.46 టీఎంసీల నీరు ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఈ జిల్లాలో దాదాపు 180 చెరువులకు పైగా మత్తళ్లు దుంకాయి. చాలా వరకు జిల్లాలోని చెరువులు నిండాయి. మం జీరా ప్రాజెక్టు సామర్థ్యం 1.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం1.40 టీఎంసీలు ఉంది. నల్లవాగు ప్రాజెక్టు కూడా నిండుకుంది. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. దీంతో దీని పరీవాహక ప్రాంతంలో సాగుకు ఢోకా లేదు. ఇలా ఉమ్మడి మెదక్ జిల్లాలోని చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.