మైనంపల్లికి ధన బలమైతే.. మీరే నా బలం.. బలగం
ఆడబిడ్డగా ఆశీర్వదించండి.. మీ అభిమానం, దీవెనలే నాకు కొండంత బలం. ప్రతి ఎన్నికల్లో ఆడబిడ్డగా ఆదరిస్తూ గెలిపిస్తున్నారు. అదే తీరున కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అభ్యర్థించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
- ఆడబిడ్డను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసుకుందాం
- మీరు నాటిన మొక్కను.. మీ ఆభిమానం, దీవెనలే నాకు కొండంత బలం
- కాంగ్రెస్‌కు అవకాశమిస్తే తెలంగాణ ఆగమైతది
- 55 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు
- దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు
- వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత కేసీఆర్‌దే
- ఢిల్లీ లీడర్లకు ఏమి తెలుసు గల్లీ బాధలు
- మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
- జనసంద్రమైన రాందాస్ చౌరస్తా
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 28 : ఆడబిడ్డగా ఆశీర్వదించండి.. మీ అభిమానం, దీవెనలే నాకు కొండంత బలం. ప్రతి ఎన్నికల్లో ఆడబిడ్డగా ఆదరిస్తూ గెలిపిస్తున్నారు. అదే తీరున కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అభ్యర్థించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆయా వార్డుల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు బతుకమ్మలు, బోనాలతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో రాందాస్ చౌరస్తా జనసంద్రంగగా మారింది. పద్మాదేవేందర్‌రెడ్డి నవాబుపేట వీధి నుంచి వేలాది మంది కార్యకర్తలతో కలిసి పెద్దబజార్, న్యూ మార్కెట్, జేఎన్‌రోడ్డు మీదుగా వచ్చారు. అడుగడుగునా పద్మాదేవేందర్‌రెడ్డికి ప్రజలు జేజేలు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే ఒక్క క్షణం ఆలోచించకుండా రాజీనామా చేశానని గుర్తు చేశారు.
కాంగ్రెస్‌కు అవకాశమిస్తే రాష్ట్రం ఆగమే..
కాంగ్రెస్‌కు అవకాశమిస్తే తెలంగాణ ఆగమైతదని, కారు గుర్తుకే ఓటేసి మరోసారి బీఆర్ఎస్కు అధికారమివ్వాలని కోరారు. 55 ఏండ్ల పాలనలో తెలంగాణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి మోసపోరాదన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్న ఘనత కూడా కేసీఆర్‌దేనన్నారు. పీసీసీ అధ్యక్షుడు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతదని అంటున్నారు. 3 గంటల కరెంట్ ఓ మూల సైతం తడవదన్నారు. కాంగ్రెస్‌ను నమ్మితే రాష్ట్రం ఆగమవుతదన్నారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతుబీమా పథకాలు తీసుకొచ్చారాన్నారు. రైతుబంధు రూ.16 వేలకు పెంపు, ఆసరా పింఛన్ రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంపు, కల్యాణలక్ష్మి లానే సౌభాగ్యలక్ష్మితో మహిళలకు నెలకు రూ.3 వేలు అందించనున్నట్లు తెలిపారు. సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు, రూ.400కే సిలిండర్, రేషన్‌కార్డు ద్వారా సన్నబియ్యం, రూ.5 లక్షల బీమా, ఆరోగ్యశ్రీ రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెం చనున్నట్లు పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తు న్న బీఆర్ఎస్కు ప్రజలు అండగా నిలువాలన్నారు.

మెదక్‌కు రూ.305 కోట్లతో రింగ్ రోడ్
మెదక్‌కు రింగ్‌రోడ్డు కోసం రూ.305 కోట్లు నిధులు ప్రతిపాదించామని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రింగ్‌రోడ్డు పనులు జరుగుతాయన్నారు. ఇప్పటికే పిల్లికొటాల్లో మాతా శిశు సంరక్షణ దవాఖాన నిర్మించుకున్నామన్నారు. రూ.180 కోట్లతో 500 పడకల దవాఖాన, నర్సింగ్ కళాశాల నిర్మించుకోబోతున్నట్లు తెలిపారు. మైనార్టీల కోసం రూ.2.50 కోట్లతో షాదీఖానా, రూ.2 కోట్లతో జిల్లా గ్రంథాలయ భవనం నిర్మించుకున్నామన్నారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు నిర్మించుకున్నామన్నారు. మెదక్‌కు రైలు సైతం తెచ్చుకున్నామన్నా రు. ఇప్పటికే మెదక్‌లో 1300 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిం చి 500 కుటుంబాలకు ఇచ్చామని పేర్కొన్నారు. 2014లో మెదక్‌కు కేసీఆర్ వచ్చినప్పుడు నా బిడ్డ పద్మను గెలిపిస్తే మెదక్‌ను జిల్లా హెడ్‌క్వార్టర్ చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నారన్నారు. ప్రగతి శంఖారావానికి వచ్చిన సీఎం మెదక్ పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్లు నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు.
ఎమ్మెల్యేగా మైనంపల్లి మెదక్‌కు ఏమి చేశావ్?
ఎన్నికలప్పుడు వచ్చి తరువాత మాయమయ్యే వారు కావాలా? ఎల్లప్పుడూ మీకు ఉండే వారు కావాలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మైనంపల్లి హన్మంత్‌రావు మెదక్ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి ఏమి చేశావని ఆమె ప్రశ్నించారు. ఇక్కడ ఏమి చేయకనే మల్కాజిగిరి పారిపోయావన్నారు. బీఆర్ఎస్ నిన్ను ఆదరించిందని, సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ చేశారని. ఈ రోజు నీ కుమారుడికి టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారడం సమంజసం కాదన్నారు. నీ కుమారుడికి ఏమి తెలుసు చేను, చెలుకా తెలియదు, సీసీ, తారు రోడ్డు తెలువదన్నారు. మీటింగ్‌లో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్లు సమీయొద్దీన్, లక్ష్మీనారాయణగౌడ్, కిశోర్, ఆంజనేయులు, విశ్వం, శ్రీనివాస్, వసంత్‌రాజ్, వనజ, గాయత్రి, కల్యాణి, జయశ్రీ, లలిత, సులోచన, రుక్మిణి, యశోద, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్, మాజీ కౌన్సిలర్లు అంకం చంద్రకళ, పెర్క కిషన్, గౌష్‌ఖురేషి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, కృష్ణాగౌడ్, నాయకులు తిరుపతిరెడ్డి, మ్యాడం బాలకృష్ణ, జనార్దన్‌రెడ్డి, లింగారెడ్డి, ప్రభురెడ్డి, దుర్గప్రసాద్, బొద్దుల కృష్ణ, శ్రీదర్యాదవ్, గోదల సాయి, సతీష్, కిరణ్, అరుణ్, బాలరాజ్, ప్రసాద్, రమేశ్, విప్లవ్, కొండ శ్రీనివాస్, సంగ శ్రీకాంత్, కిరణ్, అరుణ్, ఉమర్, జుబేర్, బట్టి ఉదయ్, ఎంఐఎమ్ నాయకుడు ఆమ్జాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

