రామాయంపేట, మే 14 : ఆలయాలకు పెద్దపీట వేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని, నాడు ప్రత్యేక నిధులను వెచ్చించి మారుమూల ఉన్న ఆలయాలకు సైతం నిధులను కేటాయించి అభివృద్ధికి పాటుపడ్డారని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం రామాయంపేట పురపాలిక పరిధిలోని గొల్పర్తి పెద్దమ్మ దేవాలయ వార్షికోత్సవాలకు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. కళాకారులు పెద్దమ్మ పెద్దిరాజు కథలను వినిపించారు.
అనంతరం సుభాష్‌రెడ్డి మాట్లాడుతు దేవాలయాల అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి దేవాలయాల మీద అసలు దయాగుణం లేదన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు. మంగళవారం రాత్రి పెద్దమ్మ ఆలయంలోని శివసత్తుల ఆటపాటలు, డప్పు చప్పుల్లు నృత్యాలతో ఎడ్ల బండ్లను ఆలయం చుట్టూరా ప్రదర్శణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.