Special Pooja | మెదక్ రూరల్, అక్టోబర్ 26 : కార్తీక మాసం పురస్కరించుకొని ఆదివారం మెదక్ మండలంలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ మండల పరిధిలోని మంబోజి పల్లి, మాచవరం కోయగుట్ట మల్లికార్జున స్వామి ఆలయం, శివాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
కార్తీక మాసం నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతా శివన్నామ స్మరణతో మార్మోగిపోయింది. ఆయా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కార్తీక మాసం అంటేనే పూజలు, శుభకార్యాలు, వ్రతాలకు ప్రత్యేకమని తెలిసిందే. కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. మరి కొందరు నదీ స్నానాలు, ఆలయ దర్శనాలు చేస్తుంటారు.

Jigris Release Announcement | విడుదల తేదీని ప్రకటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘జిగ్రీస్’
Nara Rohith | మొదలైన నారా రోహిత్ పెళ్లి పనులు.. హల్దీ వీడియో వైరల్