నిజాంపేట : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి, కార్పొరేటర్ మందాటి శ్రీనివాసరావు అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలోని క్లస్టర్ నెంబర్ 2 కళ్యాణ్ నగర్లో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరపున స్టిక్కర్లను అతికించారు.
ఈ సందర్భంగా కంటారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ఎన్నికలు ఏవైనా గెలిచేది బీఆర్ఎస్ అభ్యర్థులే అన్నారు. ఓటర్లంతా బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని, భారీ మెజార్టీతో మాగంటి సునీత గోపీనాథ్ గెలవడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో పాటు మెదక్ నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.