సిద్దిపేట,సెప్టెంబర్ 7: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు వరమైతే ..ప్రతిపక్షాలకు శాపంగా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేటలోని పద్మనాయక కల్యాణ మండపంలో సిద్దిపేటరూరల్, అర్బన్ మండలాలకు సంబంధించి 1322 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి చెక్కులను అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్‌తో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల ఇబ్బందులను గుర్తించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడంతో మండుటెండల్లోనూ చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయన్నారు.
బీజేపీ మంత్రులు, నాయకులకు మాత్రం ఇవి కనిపించడం లేదన్నారు. సీఎం కేసీఆర్ నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంతో నేడు బోరు మోటార్లు కాలిపోవడం లేదన్నారు. వేరే రాష్ర్టాల నుంచి కూలీలు వలస నుంచి మన పొలాల్లో నాట్లు వేస్తున్నారన్నారు. పండించిన ధాన్యాన్ని బస్తాల్లోకి ఎత్తేందుకు బీహార్ కూలీలు వస్తున్నారన్నారు. కేంద్రం ధాన్యం కొనకుంటే సీఎం కేసీఆర్ ప్రతి గింజనూ కొనుగోలు చేయించారన్నారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళల కోసం ఆలోచించి పింఛన్లు ఇస్తున్నామన్నారు. ప్రతి నెలా రెండు మండలాల్లో 13104 మందికి పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 53,547 మందికి ప్రతి నెలా పింఛన్లు ఇస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం రూ. 10 కోట్లు ఖర్చుచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, సీనియర్ నాయకుడు బాలకిషన్‌రావు, ఎంపీపీలు సవితాప్రవీణ్‌రెడ్డి, శ్రీదేవీచందర్రావు,జడ్పీటీసీ శ్రీహరిగౌడ్, డీఆర్డీఏ పీడీ గోపాల్‌రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మచ్చ విజితావేణుగోపాల్రెడ్డి,ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభాకర్ వర్మ, ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు పాల్గొన్నారు.
జీతం లెక్క ఆయిల్‌పామ్ ఆదాయం
చిన్నకోడూరు, సెప్టెంబర్ 7 : తెలంగాణ వచ్చాక సాగు విధానంలో మార్పు వచ్చిందని, రైతుల జీవితాల్లో వెలుగు కోసం తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా కృషి చేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎంపీపీ కూర మాణిక్యరెడ్డితో కలిసి సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో చిన్నకోడూరు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ఆసరా కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు ద్వారా ఆదాయం వస్తున్నదన్నారు. ఆయిల్‌పామ్ సాగుకు రైతులు మొగ్గు చూపాలని, ప్రతినెలా జీతం మాదిరి ఆదాయం సమకూరుతుందని కోరారు. ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం రూ.300 కోట్లతో జిల్లా ప్రణాళిక రూపొందించిందన్నారు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రతిపక్షాలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, ఒకరు గాంధీ భవన్లో, మరొకరు కేంద్ర మంత్రి ఎకరాకు కూడా నీరు రాలేదని రోజూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గోదారి నీటి ద్వారా వచ్చిన పంట దిగుబడి సాక్ష్యం కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం జలాలు రావడంతో ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని, తెలంగాణ ప్రజలకు కాళేశ్వర జలాలు వరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సొసైటీ చైర్మన్లు, టీఆర్ఎస్ మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
గణనాథులకు మంత్రి పూజలు
సిద్దిపేట కమాన్, సెప్టెంబర్ 7 : సిద్దిపేటలోని మంత్రి హరీశ్‌రావు నివాసం వద్ద నెలకొల్పిన గణనాథునికి, శ్రీనగర్ కాలనీలో ఛత్రపతి శివాజీసేన ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద ఆర్థిక, వైద్యా రోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, టీఆర్ఎస్ నాయకులు మరుపల్లి శ్రీనివాస్, నాయకం లక్ష్మణ్, మహిళలు పాల్గొన్నారు.