CITU | చిలిపిచెడ్, అక్టోబర్ 21 : మెదక్లో జరిగే సీఐటీయూ 5వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ మెదక్ జిల్లా కోశాధికారి కడారి నర్సమ్మ అన్నారు. మంగళవారం చిలిపిచెడ్ మండల కేంద్రంలో సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతుందన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మికులకు అన్యాయం చేసిందని, కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్, కనీస సౌకర్యాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందినదన్నారు.
కార్మికుల సమస్యలను చర్చించడానికి డిసెంబర్ 7,8,9 తేదీలలో మెదక్ పట్టణంలో జరిగే సీఐటీయూ 5వ రాష్ట్ర మహాసభలను నిర్వహించడం జరుగుతుందని, మొదటిరోజు 7వ తేదీన బహిరంగ సభ, 8,9 తేదీలలో రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కావున కార్మికులు, కర్షకులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు, నాయకులు శేఖర్, సంతోష్, కార్మికులు ప్రభాకర్, ఆశయ్య, ఎసయ్య, మాణిక్యం, గోపాల్, వెంకయ్య, మణయ్య తదితరులు పాల్గొన్నారు.
Narnoor | నార్నూర్ ఉప మార్కెట్ యార్డులో వెదజల్లుతున్న దుర్వాసన
Sukumar | శిష్యుల కోసం సుకుమార్ దుబాయ్ ట్రిప్.. లెక్కల మాస్టారు మంచితనానికి టాలీవుడ్ ఫిదా!