సిద్దిపేట, ఏప్రిల్ 3: బీఆర్ఎస్ నుంచి అన్నిరకాలుగా లబ్ధిపొంది, కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు బీఆర్ఎస్పై అభాండాలు మోపడం తగదని బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేటలోని హరీశ్‌రావు నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ టికెట్‌పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సహాయ సహకారాలతో గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమే అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో విలువ లేదని బీఆర్ఎస్లో చేరే సమయంలో వారు ఇచ్చిన స్టేట్మెంట్ను ఒకసారి గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. ముగ్గురు కౌన్సిలర్లు వారి స్వార్థ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌లో చేరారని, బీఆర్ఎస్లో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని గెలిచి కాంగ్రెస్‌లో చేరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు నాగరాజురెడ్డి, వజీర్, సాయిఈశ్వర్‌గౌడ్, నాయకులు సయ్యద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.