గులాబీ గూటికి జిన్నారం యువకులు..
జిన్నారం, జనవరి 22: సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన వివిధ పార్టీలకు చెందిన యువకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. జిన్నారం గ్రామానికి చెందిన పలువురు యువకులు పటాన్చెరులో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో అరుణ్, వికాస్, రోహిత్, బాలేశ్, నవీన్, రాజు, నితిన్, మహేశ్, శివ, శ్రీకాంత్, శంకర్, సాయి, సర్వేశ్, నరేశ్ తదితరులున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ర్టాన్ని సాధించి అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్‌గా తెలంగాణ రాష్ర్టాన్ని నిలిపిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకటేశంగౌడ్, ఉపసర్పంచ్ సంజీవ, పార్టీ మండలాధ్యక్షుడు రాజేశ్, వార్డు సభ్యులు శ్రీనివాస్‌యాదవ్, ఏర్పుల లింగం, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, బ్రహ్మేందర్గౌడ్, యాదయ్య, నర్సింగ్‌రావు, మల్లేశ్, నిఖిల్‌గౌడ్, ప్రేమ్, శివగౌడ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని చేసే పార్టీలో చేరుతున్నాం..
చేగుంట, జనవరి 22: గత ఉప ఎన్నికలో మాయ మాటలు చెప్పి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే గ్రామంలో పైసా పనిచేయలేదని ఆరోపిస్తూ ఆదివారం పలువురు బీజేపీ నేతలు బీఆర్ఎస్లో చేరారు. నార్సింగి మండలం వల్లూర్‌కు చెందిన బీజేపీ యూత్ నాయకులు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో 30 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన సందర్భంగా మహంకాళి, శ్రీనివాస్, శేఖర్ మాట్లాడుతూ గత ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే గ్రామంలో పైసా పనిచేయలేదని, బీజేపీలో చేరి మోసపోయామన్నారు. ఎంతో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ వైపే ఉండి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ వాహీద్, సర్పంచ్ ఆనందాస్ మహేశ్వరి, ఎంపీపీ చిందం సబీతారవీందర్, జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మైలరాం బాబు, రాజేశ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎర్రం అశోక్, మాజీ ఎంపీటీసీలు సత్యం, తౌర్య, సొసైటీ చైర్మన్ శంకర్‌గౌడ్ తదితరులున్నారు.