నర్సాపూర్, జూన్ 23: బీఆర్ఎస్కు కార్యకర్తలే ఆయువుపట్టు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని జక్కపల్లిలో మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత జక్కపల్లి శ్రీనివాస్ విగ్రహాన్ని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నిజాయితీకి మారుపేరు దివంగత జక్కపల్లి శ్రీనివాస్ అని, అతన్ని కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. వరుసగా మూడు సార్లు సర్పంచ్‌గా గెలువడమే శ్రీనివాస్ నిజాయితీ తెలుస్తుందన్నారు.
వేరే పార్టీలోకి రావాలని ఎన్నో ఆఫర్లు వచ్చినా కేసీఆర్ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని అతడు వీడలేదని గుర్తుచేశారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మాజీ ఎంపీటీసీ సంధ్యారాణీఛత్రూనాయక్ ను అభినందించారు. కార్యకర్తలు, నాయకులే పార్టీకి ఆయువుపట్టు అని, వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు. నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ కావాలని పట్టుబడి కొట్లాడిన వారిలో శ్రీనివాస్ దంపతులు ఒకరని గుర్తుచేశారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస్ లాంటి గొప్ప కార్యకర్తను కోల్పోవడం చాలాబాధగా ఉందన్నారు.
ప్రజల మధ్య ఉంటూ సమస్యలు పరిష్కరించే గొప్ప వ్యక్తి శ్రీనివాస్ అని కొనియాడా రు. ఆరోగ్యం బాగా లేకున్నా సమస్యలు పరిష్కరించి ఇంటికి వచ్చిన తర్వాత కుప్పకూలి మరణించాడని గుర్తుచేశారు. శాంతిమార్గంలో సమస్యలు పరిష్కరించేవాడన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా ముం దుంటానని వెల్లడించారు. అనంతరం బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస్ కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.
తెలంగాణ ఉద్యమకాలంలో శ్రీనివాస్ చురు గ్గా పనిచేశాడని, మండలంలోనే మంచి వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడని తెలిపారు. శ్రీనివాస్ భార్య, మాజీ సర్పంచ్ వెంకటలక్ష్మి, లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్యంగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, జడ్పీ కో-ఆప్షన్ మాజీ సభ్యుడు మన్సూ ర్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ శివకుమార్, మాజీ ఎంపీటీసీ సంధ్యారాణి ఛత్రునాయక్, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.