మెదక్ మున్సిపాలిటీ, జనవరి 15: సు ప్రీం కోర్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ అప్పీల్‌ను కొట్టి వేసిందని కాంగ్రెస్ నాయకులు చెప్పడం శుద్ధ అబ ద్ధమని, కాంగ్రెస్ నాయకుల మాటలు అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి బుధవారం మండిపడ్డారు. సుప్రీం కోర్టు ఈ దశలో జోక్యం చేసుకోవడం సముచితం కాదని అన్నదని…సుప్రీం కోర్టు సూచన, ఆలోచన మేరకు న్యాయ వ్యవస్థపైన సంపూర్ణ గౌరవంతో కేటీఆర్ న్యాయవాదులు సుమోటోగా అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేసే నాటికి మొత్తం వ్యవహారం ఎఫ్ఐఆర్గా మాత్రమే ఉంది.. ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని ఈనెల 7న కేటీఆర్ న్యాయవాదులు సుప్రీం కోర్టుకు వెళ్లారని చెప్పారు. సమయభావం వలన వాయిదా వేసిందన్నారు. కేటీఆర్ మాత్రం ఈనెల 9వ తేదీన ఏసీబీ కార్యాలయానికి వెళ్లి విచారణకు పూర్తిగా సహకరించారని సుభాష్‌రెడ్డి గుర్తు చేశారు.
ఈ కేసు కేవలం రాజకీయ వేధింపులు మాత్రమే అనే విషయాన్ని స్పష్టంగా ఏసీబీ అధికారులకు కేటీఆర్ తెలియజేశారన్నారు. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్నా విజ్ఞప్తిపై 9వ తేదీన సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నారని, బుధవారం సుప్రీం కోర్టు సలహా మేరకు వెనక్కి తీసుకున్నారని సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం అప్పీల్‌ను కేటీఆర్ వెనక్కి తీసుకోవడం ఎదురు దెబ్బ అని అవగాహన రాహిత్యంగా మాట్లాడటం సరికాదన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టులో తమ అప్పీళ్లను వెనక్కి తీసుకోలేదా ఆని సుభాష్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు చరిత్రను గుర్తుంచుకోవాలని సూచించారు.