Harish Rao | మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ చేయదలచుకున్నరా..?: హరీశ్ రావు
Harish Rao | మూడు సంవత్సరాలుగా నర్సాపూర్‌లో కాళేశ్వరం కాలువ పనులు ఆగిపోయాయి. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిందో.. అప్పటినుంచి ఈ కాలువ పనులు జరుగడం లేదని రైతులంతా కూడా చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Harish Rao | నర్సాపూర్‌లో నిలిచిపోయిన కాళేశ్వరం కాలువ పనులను మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాళేశ్వరం కాలువ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని.. రైతులు సాగునీరు లేక అల్లాడుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో పరుగులు పెట్టిన కాలువ పనులు.. ఇప్పుడు రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో పిచ్చిమొక్కలు మొలిచి దర్శనమిస్తున్నాయన్నారు.
మూడు సంవత్సరాలుగా ఈ కాలువ పనులు ఆగిపోయాయి. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిందో.. అప్పటినుంచి ఈ కాలువ పనులు జరుగడం లేదని రైతులంతా కూడా చెబుతున్నారని హరీశ్ రావు తెలిపారు. ముఖ్యంగా ఆనాడు కేసీఆర్ మల్లన్న సాగర్ నుంచి నర్సాపూర్ వైపు 17 కిలో మీటర్ల టన్నెల్.. ఆ తర్వాత ఇక్కడి నుంచి కాలువలు తవ్వి నర్సాపూర్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గానికి సాగునీరందించడం కోసం 18, 19 ప్యాకేజీలను చిన్న లిఫ్ట్‌తో సింగూరు కూడా నీళ్లు నింపుకునే అవకాశానికి.. గోదావరి నీళ్లతో నీళ్లు నింపుకునే ఆలోచన ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లుగా ఎక్కడికక్కడ కాళేశ్వరం పనులు నిలిచిపోయినయన్నారు.
గజం కాలువ కూడా ఈ జిల్లాలో తవ్వడం లేదు. రేవంత్‌రెడ్డి మొన్నప్పుడో జహీరాబాద్‌కు వచ్చిండు.. కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనని ఫైర్ అయ్యారు హరీశ్ రావు. ఈ జిల్లాకు పనికొచ్చే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ మధ్య సంగారెడ్డికి వచ్చిండు.. ఉద్దెర మాటలు మాట్లాడి పోయిండు తప్ప.. ఒక్క మాట ఈ జిల్లా గురించి కానీ.. ఈ జిల్లాలో జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కూడా ఆయన మాట్లాడింది లేదు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క చెరువు తవ్వింది లేదు.. ఒక్క చెక్‌డ్యాం కట్టింది లేదు. ఒక గజం కాలువ తవ్వింది కూడా లేదు. అంటే ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ చేయదలచుకున్నరా..? కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లా నుంచి ఎత్తేయదలచుకున్నరా..? మీరెందుకు ఈజిల్లాను చిన్నచూపుచూస్తున్నరో చెప్పాలన్నారు.
5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి, పటాన్ చెరు.. 5నియోజకవర్గాల్లో దాదాపు 4-5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ నిలిపేశారన్నారు. ఈ ప్రభుత్వంలో ఒక్క అంగుళం కూడా పనులు జరుగడం లేదన్నారు. ఘనపురం ఆనకట్టు ఎత్తు పెంచాలని ఆనాడు కేసీఆర్ నిధులు మంజూరు చేశారు. దాదాపు సగానికిపైగా పనులు జరిగినయి. మరి ఆ ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచే పనిని ఎందుకు ఆపేశారని అడిగారు. అది పూర్తయితే ఇటు నర్సాపూర్ నియోజకవర్గానికి, ఇటు మెదక్ నియోజకవర్గానికి ఉపయోగపడే ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ ఆపేసి ఇటు నర్సాపూర్, అటు మెదక్ నియోజకవర్గం ప్రజలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
LIVE: నర్సాపూర్ నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish https://t.co/l5KV0jXlLf
— BRS Party (@BRSparty) September 3, 2026
Read Also :
Rashmika | భర్త విజయ్‌తో మూడు నెలల తర్వాత ఫుల్ క్వాలిటీ టైమ్.. నేచరే ఇలా చేసిందేమో ..
ACB | సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య నివాసంలో ఏసీబీ మెరుపు దాడులు
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

