కొమురవెల్లి, ఏప్రిల్ 1 : ‘తలాపునా పారుతుంది గోదావరి మనసేను సెలక ఎడారి” అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాడుకున్న పాట మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నోట వినపడుతున్నది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గురువన్నపేటలో రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పక్కనే కూత వేటుదూరంలో తపాస్‌పల్లి రిజర్వాయర్ ఉన్నా గురువన్నపేట రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
గ్రామానికి చెందిన పుట్ట వెంకట్ అనే రైతు రెండు ఎకరాల్లో వరిసాగు చేయగా వచ్చిపోయే కరెంట్‌తో పం టకు నీళ్లు సరిపోవడం లేదు. కండ్ల ముందు ఎండుతున్న పంటను కాపాడుకోవటానికి తంటాలు పడుతున్నాడు. కిరాయికి తెచ్చుకున్న నీళ్ల ట్యాంకర్ ద్వారా రెండు రోజలకు ఒకసారి వరిపొలానికి నీళ్లు పారిస్తున్నా డు. కండ్ల ముందే పొలం ఎండిపోతుంటే బాధ కలుగుతున్నదని ఆయ న ఆవేదన వ్యక్త చేశాడు.