మెదక్ మున్సిపాలిటీ, జూన్ 21: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, శారీరక రుగ్మతలు దూరమవుతాయని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా యువజవ, క్రీడల శాఖ, వశిష్ట యోగా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు.

కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు, యోగా గురువు రవి, దేవేందర్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాస్ చంద్రగౌడ్, నెహ్రూ యువకేంద్ర కో ఆర్డినేటర్ కిరణ్ పాల్గొన్నారు.
