నర్సాపూర్, మార్చి 1: చదువు ఇష్టం లేక విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్‌కు చెందిన కిశోర్,సునీత దంపతులు కొన్ని రోజుల క్రితం నర్సాపూర్‌లో స్థిరపడ్డారు.
వీరి కూతురు వైష్ణవి హైదరాబాద్ నాగోల్‌లోని శ్రీచైతన్య కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నది. నెల క్రితం ఇంటికి వచ్చిన కూతురు వైష్ణవి చదువు ఇష్టం లేదని పలుమార్లు తల్లిదండ్రులకు తెలియజేసింది. నర్సాపూర్‌లోని అల్లూరి సీతారామరాజు గురుకులంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తండ్రి కిశోర్ చదువుకోవాలని కూతురిని పలుమార్లు సముదాయించారు.
తనను మరలా కళాశాలకు పంపిస్తారన్న భయంతో కూతురు వైష్ణవి శనివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నర్సాపూర్ ఏరియా దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వైష్ణవి మృతి చెందినట్లు నిర్ధారించారు. కూతురు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు.