నర్సాపూర్ : గ్రామాలలో కోతుల దాడులు రోజురోజుకి శృతి మించిపోతున్నాయి. ఇంటి నుండి బయటకు రావాలంటేనే గ్రామస్తులు జంకుతున్నారు. ఇంటి తలుపు తీసి ఉన్నాయంటే ఇంట్లో సామగ్రిని గుల్ల చేస్తూ ప్రజలను ఆగమాగం చేస్తున్నాయి. ఇదే సమస్య మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూర్ గ్రామంలో తలెత్తింది. కోతులను గ్రామంలో నుండి తరిమివేయడానికి గ్రామ ఉపసర్పంచ్ శ్రీనివాస్ వార్డ్ మెంబర్లు రమేష్, భవానిమహేష్ లు ఓ ప్లాన్ వేశారు.
గ్రామంలో ఉన్న ఓ బాలుడికి చింపాంజీ వేషం వేయించి గ్రామంలోని వీధి వీధికి తిప్పారు. నిజమైన చింపాంజీనే గ్రామంలోకి వచ్చిందనుకొని గ్రామంలోని కోతులు పారిపోయాయి. కోతులను తరమడానికి గ్రామ ఉపసర్పంచ్ శ్రీనివాస్ వార్డ్ మెంబర్లు రమేష్, భవానిమహేష్ లు చేసిన ఈ ఆలోచనను గ్రామస్తులు అభినందించారు.