Collector Rahul Raj | నిజాంపేట, జూన్ 25 : ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం మండలంలోని నందిగామలో ఇందిరమ్మ ఇండ్లతోపాటు స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 9 వేల వరకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు ఇవ్వగా.. 2500 మంది ఇందిరమ్మ ఇండ్లకు మార్క్ ఇచ్చారని తెలిపారు. త్వరగా ఇండ్ల నిర్మాణం చేపట్టాలని వారం రోజుల్లోపు వాటికి సంబంధించిన డబ్బు లబ్ధిదారులకు అందుతుందన్నారు.
కొండపోచమ్మ సాగర్ కాల్వ పనులు ప్రారంభించుర్రి..
నందిగామ గ్రామానికి వచ్చిన కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను స్థానిక రైతు గెల్లు ఎంకయ్య కలిసి కొండపోచమ్మ సాగర్ కాల్వ పనులు ప్రారంభించుర్రి అని అడిగాడు. ఇద్దరు వ్యక్తుల భూ సమస్య వల్ల కొండ పోచమ్మ సాగర్ కాల్వ పనులు ఆగిపోయాయని.. ఈ సమస్య పరిష్కారమైతే దాదాపుగా మూడు చెరువులలోకి గోదావరి జలాలు వచ్చి 3 వేల ఎకరాల వరకు పంటలు పండుతాయని కలెక్టర్‌కు రైతు ఎంకయ్య వివరించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి, ఎంపీవో ప్రవీణ్, ఆర్ఐ ప్రీతి, పంచాయతీ కార్యదర్శిలు యాదవలక్ష్మి, ఆరిఫ్,నాయకులు వెంకటేశ్‌గౌడ్, అంజిరెడ్డి, లింగుస్వామి తదితరులు ఉన్నారు.
High Court | మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి : తెలంగాణ హైకోర్టు ఆదేశం
Gupta Nidhulu | గుప్తనిధుల కోసం ఆంజనేయ స్వామి ఆలయంలో తవ్వకాలు
cricket tournament | యువత క్రీడల్లో రాణించాలి.. క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన చల్మెడ