రామాయంపేట/ వట్పల్లి/ కొల్చారం, నవంబర్ 2: తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో రామాయంపేట మండలంలోని ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడు గోపి శ్రీనివాస్, కార్యదర్శి శాలిపేట లక్ష్మణ్‌తోపాటు మరో 20మంది కార్యకర్తలు గురువారం బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ మాజీ మండలాధ్యక్షుడు బిల్లం శామిరెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తకు స్థానం లేదన్నారు. సీఎం కేసీఆర్‌ను చూసి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు బిల్లం శామిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు మండలాధ్యక్షుడు నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ మానుగల్ల రామకిష్టయ్య, పంబాల శ్రీనివాస్, తుడుం పౌలు, ప్రసాద్, గోపిరాజు పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. వట్పల్లి మండలకేంద్రంలో గురువారం బీజేపీ సీనియర్ నాయకులు, అల్లాదుర్గం మండ లానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఎన్నికల ఇన్చార్జి ఫరూఖ్హుస్సేన్ అధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు కరపత్రాలకే పరిమితం అవుతయన్నారు. ప్రజలు కాంగ్రెస్ హామీలను నమ్మే పరిస్థితులో లేరన్నారు. అభివృద్ధి కంటికి కనిస్తున్నదని, కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు హెచ్చరించారు.
కొల్చారం మండలంలోని కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కొల్చారం మండలంలోని కొంగోడు గ్రామంలో ఎన్నికల ప్రచారం చేయడానికి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి వచ్చారు. వీరి సమక్షంలో పైతర సర్పంచ్ వెల్మకన్నె సంతోష, ఎల్లేశం దంపతులతో పా టు యాభై మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్వై నాయకుడు రవితేజరెడ్డి, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. బీఆర్ఎస్లో చేరిన వారిలో వార్డు సభ్యుడు జుంజు రత్నయ్య, రంగంపేట సొసైటీ డైరెక్టర్ బట్ట జీవయ్య, మాజీ వార్డు సభ్యుడు తాటి మల్లేశం, నాయకులు కుమ్మరి భూమయ్య, తాటి మల్లేశం, కుసంగి రాజు, జాజుల శంకర్, పుట్టి కృష్ణ, వెల్మకన్నె విజయ్, శాంతి కుమార్, శ్రీను, మణయ్య, ఎర్ర రత్నయ్య, బంగులింటి దుర్గ య్య, జాజుల అశోక్, శివమ్మోల సంతు, ఈటెల పద్మయ్య, కొండ నర్సింహులు, బీరప్ప, ఎర్ర మల్లేశం, ఆరట్ల సురేశ్, కంటి నాగులు, జాజుల యేసయ్య, మల్లంపేట లచ్చయ్య, పుర్ర ప్రభాకర్, కంటె యాదయ్య తదితరులు ఉన్నారు.
కొల్చారం మండలకేంద్రానికి చెందిన చౌరిగారి భాస్కర్ (బీజేపీ జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి), చక్రధర్‌గౌడ్(నర్సా పూర్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జి), ఖలీల్ తది తరులు సునీతారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.