బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. గురువారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో మండల పరిధిలోని రాజ్‌పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మనియార్పల్లికి చెందిన కాంగ్రెస్ నేతలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిన్నారం మండలం ఊట్ల యువకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ గూటికి చేరారు.
– జహీరాబాద్/ మెదక్ రూరల్/ జిన్నారం, సెప్టెంబర్ 28
జహీరాబాద్/ మెదక్ రూరల్, సెప్టెంబర్ 28: అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. గురువారం మెదక్ జిల్లా రాజ్‌పల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. ముదిరాజ్ సంఘం గ్రామాధ్యక్షుడు యేసయ్య, సంఘం సభ్యులు నాగరాజు, నారాయణతోపాటు మరో 20 మంది పార్టీలో చేరారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలోని మనియార్పల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మాణిక్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మెదక్ కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ లావణ్యారెడ్డి, వైస్ ఎంపీపీ ఆంజనేయులు, ఉపసర్పంచ్ నవీన్, నాయకులు ఎలాక్షన్రెడ్డి, నారాయణ, లక్ష్మీనారాయణ, అనిల్, యాదగిరి, జహీరాబాద్ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహులు, సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, మాజీ సర్పంచ్ ఖధీర్, తదితరులు పాల్గొన్నారు.