హుస్నాబాద్, సెప్టెంబర్ 13: హుస్నాబాద్‌లోని వైశ్య భవన్లో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కొందరు భక్తులు రూ.10లక్షల కరెన్సీ నోట్లతో అల ంకరించారు. గురువారం రాత్రి అలంకరణ చేసిన భక్తులు శుక్రవారం సందర్శనార్ధం ఉంచారు. భక్తులు వచ్చి కరెన్సీ నోట్ల తో అలంకరించబడిన గణనాథుడిని ద ర్శించుకున్నారు. భక్తులకు సకల సంపదలు కలగజేయాలనే సంకల్పంతోనే స్వా మివారికి కరెన్సీ నోట్లతో అలంకరించి పూ జలు చేసినట్లు ఆర్యవైశ్య సంఘం నేతలు తెలిపారు.
పటాన్చెరు, సెప్టెంబర్ 13 : పోచారం లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం నిమజ్జనం పురస్కరించుకుని లడ్డూ వేలం నిర్వహించారు. శ్రీనివాస్‌గౌడ్ రూ. 4.1 1 లక్షలకు వేలంలో దక్కించుకున్నా డు. గతంలో కంటే ఈసా రి లడ్డూ వేలంలో రూ. 11వేలు అధికంగా పలికిం ది. శ్రీనివాస్‌గౌడ్‌కు యువజన సంఘం ప్రతినిధులు అశోక్‌గౌడ్, భాస్కర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, సంతోష్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్, రాజలింగంగౌడ్, ఇషాన్సింగ్ పూజలు నిర్వహించి అందజేశారు.