కంది, జనవరి 31: ఆవిష్కరణలు, పరిశోధనల్లో ఐఐటీ హైదరాబాద్ ముందున్నదని కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ను కేరళ గవర్నర్ సందర్శించారు. సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి గవర్నర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి సంబంధించి ఐఐటీహెచ్‌తో భాగస్వామ్య అవకాశాలను గవర్నర్‌కు కలెక్టర్ వివరించారు.
ఐఐటీహెచ్‌లో నూతన పరిశోధనలు, విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు, ఐఐటీ నుంచి ప్రభుత్వ రంగ అభివృద్ధికి తోడ్పాటు వంటి విషయాలను డైరెక్టర్ బీఎస్ మూర్తి వివరించారు. ఐఐటీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్‌లో అత్యాధునిక పరిశోధనలు, స్టార్టప్ సహకారాలు, పరిశ్రమలతో భాగస్వామ్యాలను తెలియజేశారు. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, హై డ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీ తదితర రంగాల్లో ఐఐ టీ చేస్తున్న పరిశోధనల ప్రాముఖ్యతను గవర్నర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఐఐటీ విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో సాగాలని, ఆవిష్కరణలు, స్టార్టప్‌లు ప్రోత్సహించేందుకు ప్రభుత్వ సహాయం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, డీఎస్పీ సత్తయ్య, కంది తహసీల్దార్ విజయలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ మల్లయ్య, ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.