కంది, అక్టోబర్ 3: సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తల ర్యాంకింగ్‌లో గుర్తింపు లభించింది. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ (ఎస్‌యూ), ఎల్స్వీయర్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రపంచ టాప్ 2శాతం శాస్త్రవేత్తల జాబితా 2025లో ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన 31మంది ప్రొఫెసర్లు 46 స్థానాలను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం ఐఐటీహెచ్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ డాక్ట ర్ బీ.వీ.ఆర్ మోహన్‌రెడ్డి ర్యాంకింగ్ సాధించిన సైంటిస్టుల (ప్రొఫెసర్లు)ను అభినందించారు. పరిశోధనలు, నూతన ఆవిష్కరణలో పెరుగుతున్న స్థాయిని మరోసారి నిరూపిస్తూ ఐఐటీహెచ్‌కు గుర్తింపు వచ్చిందన్నారు. ఈ అద్భుత విజయం పరిశోధనల పట్ల ఉన్న కట్టుబాటుకు నిదర్శనమన్నారు. ర్యాంకింగ్ గుర్తింపు రెండు విభాగాల్లో లభించింది. కేరీర్-లాంగ్ రీసెర్చ్ ఇంపాక్ట్ కింద(17 మంది ప్రొఫెసర్లు), సింగిల్-ఇయర్ రీసెర్చ్ ఇన్ప్లుయెన్స్-2024కు సంబంధించి 29మంది ప్రొఫెసర్లతో కలిపి 31మంది ప్రొఫెసర్లు మొత్తం 46స్థానాలు సాధించడం విశేషం.