మెదక్ మున్సిపాలిటీ, మే 06 : పాలన చేతగాని ముఖ్యమంత్రితో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని బీఆర్ఎస్ మెదక్ పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు అన్నారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం దివాలా తీసింది, ఎక్కడా నయాపైసా నమ్మడం లేదు, నేనేమి చేయాలని మూర్ఖపు మాటాలు మాట్లాడటం సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు. రేవంత్‌రెడ్డి మాటలతో రాష్ట్రం పరువు పోయిందన్నారు. పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా కేసీఆర్ నిలిపితే రేవంతర్‌రెడ్డి తెలంగాణ పరువు పోయేలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. పాలన చేతగాక పోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలన్నారు.
ఎన్నికల మెనిఫేస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగస్తులు పీఆర్సీ, డీఏలు అడిగితే వారిని విలన్లుగా చిత్రికరించి మాట్లాడం సీఎంకు తగదన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలా మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని రేవంత్‌రెడ్డి చేతులేత్తేయడం దారుణమన్నారు. రేవంత్‌రెడ్డికి పాలన చేతగాక పోతే తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో నోట్ల రద్దు, రెండేళ్లు కరోనాతో ప్రపంచమే కొట్టుమిట్టాడుతూ నయాపైసా పుట్టని అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో తెలివి తేటలతో సంపదను సృష్టించి రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నత స్థాయిలో నడిపిన ఘనత కేసీఆర్‌ది అని కొనియాడారు.
సంపదను సృష్టిస్తాం.. ప్రజలకు పంచుతాం.. కేసీఆర్ కంటే గోప్ప పాలన అందిస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రేవంత్‌రెడ్డి ఒప్పుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ఇచ్చిన హామిలనే నేరవేర్చలేక పోయిందన్నారు. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించక పోవడం రేవంత్‌రెడ్డికే చెల్లిందన్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం మరో పదేళ్లు వెనక్కి వెళ్లడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి మాటాలు రాష్ట్ర భవిష్యత్‌కు శాపంలా మారినట్లు పేర్కొన్నారు.