చిలిపిచెడ్, ఫిబ్రవరి 21: వాహనాదారులు తమ వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లుపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై నర్సింహులు హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని చండూర్ చౌరస్తా వద్ద ఎస్సై తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ నెంబర్ ప్లేట్ లేకుండా నడుపుతున్న రెండు బైక్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు.మండల పరిధిలోని నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను నడిపితే సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని అన్నారు. ఈ తనిఖీల్లో ఏఎస్సై మిస్బోద్దీన్, సిబ్బంది ఉన్నారు.