Machavaram | గ్రామపంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని మాచవరం గ్రామ సర్పంచ్ సాంబశివరావు అన్నారు. మెదక్ మండలం మాచవరం గ్రామంలో రసవత్తర పోటీ జరగగా, ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సర్పంచ్, వార్డు మెంబర్ ల ఎన్నికలు జరిగాయి. కాగా కాంగ్రెస్ బలపరిచిన శ్రీనివాస్ చౌదరిపై 293 ఓట్ల భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సాంబశివరావు గెలుపొందారు. గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ సాంబశివరావును గ్రామంలో పలువురు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్ సాంబశివరావు మాట్లాడుతూ.. గ్రామ ప్రజల అభివృద్ధి, పారదర్శక పాలనతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకంగా వ్యవహరిస్తానని ఈ విజయం తన వ్యక్తిగత గెలుపు కాదని, మాచవరం ప్రజల విశ్వాసానికి ప్రతీక మాత్రమేనని గ్రామ ప్రజల విశ్వాసానికి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
సమస్యల పరిష్కారానికి అందరి సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ పేర్కొన్నారు. తనకు ఓటేసి గెలిపించిన గ్రామ ప్రజలకు,తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.
Ustaad Bhagat Singh | ఉస్తాద్భగత్ సింగ్తో హరీష్ శంకర్ సెల్ఫీ.. ట్రెండింగ్లో స్టిల్స్