జిన్నారం, మే 10: నేను పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించాను. 1992లో మిలటరీలో చేరాను. 2003 నుంచి దాదాపు మూడేండ్ల పాటు కార్గిల్ సరిహద్దుల్లో విధులు నిర్వహించాను. ఆపై ఫిరంగి దళంలో 16 ఏండ్లు ్ల పనిచేసే 2008లో సైనికుడిగా ఉద్యోగ విరమణ పొందాను. పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో పీస్ ఫైరింగ్ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అక్కడ హై అలర్ట్ ఉంటూ విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
పాక్, చైనా సరిహద్దుల్లో ఒకవేళ యుద్ధం మొదలైతే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. త్రివిధ దళాలు దేశ రక్షణకు పాటుపడతాయి. ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధం వస్తే పెట్రోల్ బంకుల వంటి ప్రదేశాల్లో ఉండవద్దు. ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ను ఆఫ్ చేసుకోవాలి. ఉపగ్రహ చిత్రాల ద్వారా దాడులు చేసే అవకాశాలు ఉన్నందున గుంపులుగా బయట తిరగవద్దు. 24 గంటలు అప్రమత్తంగా ఉండి ఎప్పుడు ఏమి జరిగినా ప్రభుత్వ ఆదేశాల మేరకు దానిని ఎదురొనేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో హెచ్ఆర్గా పనిచేస్తున్నా.
– శంకర్ ప్రసాద్, మాజీ సైనికుడు