మనోహరాబాద్, నవంబర్ 9 : గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, మోజార్టీ ఓట్ల కోసమే ప్రచారం చేస్తున్నామని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మండల ఇన్చార్జి పన్యాల భూపతిరెడ్డి, మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు శేఖర్‌గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం నుంచి సుమారు వెయ్యి మంది బైక్ ర్యాలీలతో మండలాధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, ఎంపీపీ పురం మహేశ్ ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీటీసీ లతావెంకట్గౌడ్, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, ఆయా గ్రామాల అధ్యక్షులు, సర్పంచ్‌లు తరలివెళ్లారు.
తూప్రాన్, నవంబర్ 9 : గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ గురువారం గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేశారు. కేసీఆర్ నామినేషన్‌కు తూప్రాన్ మండలం నుంచి బీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున తరలివెళ్లారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి గజ్వేల్‌కు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.