నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో ఇద్దరు యువకులు మృతి ( Youth Dead ) చెందారు. ఆదివారం మధ్యాహ్నం ఆనంద్ గార్డెన్ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలను ఆటో ఢీకొనగా ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

నర్సాపూర్ సమీపంలోని ఫంక్షన్ హాల్ లో ఫంక్షన్కు హాజరయ్యే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కౌడిపల్లి మండలం వెంకటరావుపేట గ్రామానికి చెందిన దిలీప్, మనోహర్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. శుభకార్యానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరగడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.