రాయపోల్, మే 6 : గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో జన జీవనం అతలాకుతలమైంది. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో మంగళవారం రాత్రి గాలివాన వల్ల చేతికి వచ్చిన వరిపంటకు తీవ్ర నష్టం జరిగింది. గాలివానకు 11కేవీ విద్యుత్ స్తంభాలు కొత్తపల్లి రోడ్డు పొడవునా కుప్పకూలడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దారిపొడవునా 11కేవీ విద్యుత్ స్తంభాలు, వైర్లు కుప్పకూలగా వాటికి మరమ్మతులు చేసేందుకు విద్యుత్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రాత్రి నుంచి ఉదయం 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. టేంకంపేట, రాంసాగర్, తిమ్మక్కపల్లి గ్రామాలకు వెళ్లే రహదారిపై పెద్దపెద్ద చెట్లు నేలకొరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండల కేంద్రంలో కూడా రోడ్డు పక్కన ఉన్న రేకుల షెడ్డు ఎగిరిపోయి నడిరోడ్డుపై పడడంతో పెనుప్రమాదం తప్పింది. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి వరిపంట సాగుచేయగా తీరా కోతకు వచ్చిన క్రమంలో గాలివాన నష్టాలు మిగిల్చింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు కూడా నేలవాలిన వరిపంటను పరిశీలించారు.
గజ్వేల్, మే 6: గాలిదుమారం, ఈదురుగాలులతో కూడిన గాలివాన మంగళవారం రాత్రి బీభత్సం సృష్టించింది. ఒక్కసారి గాలిదుమారం చెలరేగడంతో రేకులు ఎగిరిపోయాయి. చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పాతబస్తీలో విద్యుత్ స్తంభం విరిగి ఇంటిపై పడింది. మండల పరిధిలోని అక్కారం వెళ్లే మార్గంలో రోడ్లపై చెట్లు విరిగి పడ్డాయి. దాతర్‌పల్లికి చెందిన జూపల్లి మనెమ్మ ఇంటిపై రేకులు గాలివాన బీభత్సవానికి ఎగిరిపడ్డాయి.

రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై చెట్లు విరిగి పడటంతో అర్ధరాత్రి సమయంలో చెట్లను తొలిగించారు.స్తంభం విరిగి ట్రాన్స్ఫార్మర్పై పడడంతో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జగదేవ్‌పూర్ మండలం తీగుల్‌లో ఇంటిపై చెట్టు విరిగిపడింది. నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్, మర్కూక్, ములుగు, వర్గల్ మం డలాల్లో గాలిదుమారం బీభత్సం సృష్టించింది. ఆయా గ్రామా ల్లో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం రాశులు తడిసి
ముద్ద్దయ్యాయి.

తూప్రాన్, మే 6 : మెదక్ జిల్లా తూప్రా న్ మండలంలో మంగళవారం రాత్రి అకాల వర్షం కురిసింది. చేతికొచ్చిన వరి పంట నేలకొరిగింది. ఇప్పటికే వరి ధాన్యాన్ని ఆరబెట్టిన కల్లాల్లో వర్షం కల్లోలం సృష్టించింది. పలు ప్రాం తాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. తూప్రాన్ తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి మండలంలోని పలు ఐకేపీ కేంద్రాలను సందర్శించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈదురుగాలులకు 14 విద్యుత్ స్తంభాలు, రెండు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నట్లు ట్రాన్స్‌కో సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. విద్యుత్‌శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
కొల్చారం, మే 6: అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం వ్యాప్తంగా బుధవారం సాయం త్రం కురిసిన వర్షం రైతులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రంలో విక్రయించడానికి ఆరబెట్టిన ధాన్యం కుప్ప లు తడిసి నీటి పాలయ్యా యి. టార్పాలిన్లు కప్పే ప్రయత్నం చేసి నా ఫలితం దక్కలేదు. కాంటా నత్తనడకన కొనసాగడంతోనే ధా న్యం తడిసిందని రైతులు ఆరోపిస్తున్నారు. గాలివానకు చిన్నఘనపూర్ శివారులో మెదక్, జోగిపేట రహదారిపై చెట్టు విరిగి రోడ్డు పై పడి రాకపోకలకు అంతరా యం ఏర్పడింది.
