మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 16: మెదక్‌ను వరుణ దేవుడు వణికిస్తున్నాడు. 40 ఏండ్లలో కురువని వర్షం మెదక్‌లో పడిం ది. సోమవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి వరకు మరోసారి వరుణుడు ప్రతాపం చూపాడు. దీంతో పట్టణంలోని రాందాస్ చౌరస్తా, మున్సిపల్ కాంప్లెక్స్, ఆటోనగర్ రోడ్లు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలైన సాయినగర్, వెంకట్రావ్‌నగర్ కాలనీల్లోకి నీరు చేరడంతో కాలనీ వాసు లు తీవ్ర ఇబ్బందు ల పాలయ్యారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఎనిమి ది గంటల వరకు మెదక్ పట్టణంలో 71.3 మి. మీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 గంటల వరకు 78.3 మి.మీటర్ల భారీ వర్షం కురిసింది.
నిజాంపేట,సెప్టెంబర్16: మెదక్ జిల్లా నిజాంపేట మండలం వ్యాప్తంగా మంగళవారం కుండపోత వర్షం కురిసింది. చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. దీంతో పాటు పంట పొలాల్లోకి మళ్లీ వరద చేరుతున్నది.
నర్సాపూర్,సెప్టెంబర్16: మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీతో పాటు ఆయా గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. మంగళవారం సంత కావడంతో కూరగాయల వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డా రు. భారీ వర్షం పడటంతో కూరగాయలు కొట్టుకుపోయాయి. సాయంత్రం స్కూళ్లు వదిలే సమయంలో వర్షం పడడంతో విద్యార్థులు తడుచుకుంటూ ఇంటికి వెళ్లా ల్సి వచ్చింది. ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
రేగోడ్,సెప్టెంబర్ 16:భారీ వర్షానికి వాగులు పొం గి పొర్లుతున్నాయి. మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని మర్పల్లి,చౌదర్పల్లి, ప్యారారం, గజవాడ, సంగమేశ్వరతండా వాగులు రాత్రి నుంచి పొంగిపొర్లడంతో మంగళవారం రాకపోకలు నిలిచిపోయాయి. 125 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మంబోజిచెరువు కింద వరి,పత్తి పంటలు నీట మునిగాయి.
చిన్నశంకరంపేట,సెప్టెంబర్16: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో కుండ పోత వర్షం కురిసింది. భారీ వర్షానికి మండలంలో వాగు లు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల అలుగులు పారుతున్నాయి.