అందోల్, మే 19: జోగిపేటతో పాటు పరిసర గ్రామాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రహదారులపైకి పెద్దఎత్తున వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్టాప్‌లో మోకాలులోతు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. జోగిపేట-సంగారెడ్డి ప్రధాన రహదారిపై పలు చోట్ల భారీగా వరద నీరు చేరింది.
రోడ్లు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. పలు గ్రామాల్లో ఈదురు గాలులకు చెట్లు పడిపోగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అందోల్-జోగిపేట మున్సిపాలిటీతోపాటు గ్రామాల్లో డ్రైనేజీలు నిండి నీరంతా రోడ్లపై చేరి దుర్గందం వ్యాపించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.