పుల్కల్,సెప్టెంబర్ 24 : సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. వారం రోజులుగా ఏడు గేట్లు పైకి లేపి దిగువకు విడుదల చేశారు. బుధ వారం వరద ఉధృతి మరింతగా పెరగ డం తో మరో గేటును పైకి లేపి నీటిని దిగువకు విడుదల చేశామని ప్రాజెక్టు ఏఈ మహిపా ల్రెడ్డి తెలిపారు.ప్రాజెక్టులోకి బుధవారం 69,068 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగిం దన్నారు.
జన్కో ద్వారా 1577 క్యూసెక్కు లు, ఔట్ ఫ్లో 67,531 క్యూసెక్కులు దిగు వకు వదిలినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలకు, ప్రస్తుతం ప్రాజెక్టు లో 16.67 3 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి, ఎగువ నుంచి ఎంత వరద వస్తే, అంత దిగువకు విడుదల చేస్తున్నారు. గొర్రెల కాపరులు, మత్స్య కారులు నది పరీవాహక ప్రాంతా లకు వెళ్లకూడదని ప్రాజెక్టు అధికారులు సూచించారు.