తూప్రాన్, ఫిబ్రవరి 5: 22 టన్నుల రేషన్ బియ్యాన్ని మెదక్ జిల్లా తూప్రాన్‌లో పోలీసులు పట్టుకున్నారు. తూప్రా న్ మున్సిపాలిటీ పరిధిలోని అల్లాపూర్ టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టా రు. హైదరాబాద్‌లోని కాటేదాన్ నుంచి నిజామాబాద్ వైపు లారీ (లారీ నెంబర్ కేఏ56 5627)లో సలీం అనే వ్యక్తి అక్రమంగా 22 టన్నుల రేషన్ బియ్యం తరలిస్తుండగా తూప్రాన్ ఎస్సై శివానందం సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు.
పట్టుబడిన రేషన్ బియ్యాన్ని మెదక్ పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ సాధిక్‌కు అప్పగించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.